ఘోర ప్రమాదం : ఊటీలో లోయలో పడిన బస్సు

bus ootyతమిళనాడులో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. గురువారం (జూన్-14) ఊటీలోని కూనూరు వద్ద 33 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు లోయలో పడింది. దీంతో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందగా..మరో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడినవారిని సమీపంలోని హస్పటల్ కి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సహయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి సంబంధించిన దానిపై దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Posted in Uncategorized

Latest Updates