ఘోర ప్రమాదం : ముంబైలో ఇళ్లపై కూలిన ఎయిర్ క్రాఫ్ట్

mumbai-flightముంబై సిటీ వణికిపోయింది. జూన్ 28వ తేదీ మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఎయిర్ క్రాఫ్ట్ ఒకటి కూలిపోయింది. సిటీలోని ఘట్కోపర్ ఏరియాలో నిర్మాణంలో ఉన్న ఓ భవంతిపై పడింది. ఇది యూపీకి చెందిన VT-UPZ ఎయిర్ క్రాఫ్ట్ అని ప్రకటించారు అధికారులు. అందులో నలుగురు అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే మంటలు చెలరేగాయి. ఎయిర్ క్రాఫ్ట్ మొత్తం కాలిపోయింది. ఒకరు చనిపోయినట్లు అధికారికంగా తెలిపారు. ఈ విమానం జూహూలో దిగాల్సి ఉంది. ఈలోపే అదుపుతప్పి నివాస ప్రాంతాల మధ్య కూలింది.

ఎయిర్ క్రాఫ్ట్ లో ఎంత మంది ఉన్నారు.. వారు ఎవరు అనే విషయాలను యూపీ ప్రభుత్వం తెలియజేయాల్సి ఉంది. ప్రమాదం జరిగిన వెంటనే ఫైర్ సిబ్బంది, మున్సిపాలిటీతోపాటు ఎయిర్ ఫోర్స్ ఉన్నతాధికారులు కూడా స్పాట్ కు చేరుకున్నారు. మంటలను అదుపు చేశారు.

Posted in Uncategorized

Latest Updates