ఘోర ప్రమాదం..విమానం కూలి 71 మంది మృతి

FLIGJTS ACCIDENTSరష్యాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. మాస్కో దగ్గర్లో ఓ విమానం కూలిన ప్రమాదంలో 71 మంది చనిపోయారు. సరోత్సవ్ ఎయిర్‌లెన్స్‌కు చెందిన AN-148 విమానం మాస్కోలోని డొమొడెవోడో ఎయిర్‌పోర్టు నుంచి టేకాఫ్ అయింది. అయితే టేకాఫ్ అయిన రెండు నిమిషాలకే ఓర్స్‌క్‌ నగరం సమీపంలోని అర్గునోవ్ గ్రామంలో కూలిపోయినట్లు అధికారులు వెల్లడించారు. మాస్కోలో టేకాఫ్ తీసుకున్న కొంత సేపటికే రాడార్‌కు దాని సిగ్నల్స్ అందలేదు. ఆ విమానం.. మాస్కోకు బయట.. రామెన్‌స్కై జిల్లాలోని అర్గునోవో సమీపంలో కూలిపోయినట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం మాస్కోలో మునుపెన్నడూ లేని విధంగా విపరీతంగా మంచుపడుతోంది. వాతావరణం సరిగా లేకపోవడం వల్లే కూలిపోయినట్టు భావిస్తున్నారు. విమాన శకలాలు కనిపించిన ప్రదేశం కూడా పూర్తిగా మంచుతో కప్పబడి ఉంది.

మంటల్లో చిక్కుకున్న విమానం ఒక్కసారిగా ఆకాశం నుంచి కిందపడిపోయిందని ప్రత్యక్షసాక్షులు తెలిపారు. వెంటనే రంగంలోకి దిగిన రెస్క్యూ టీం విమాన శకలాల వద్దకు చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Posted in Uncategorized

Latest Updates