ఘోర రోడ్డు ప్రమాదం : 10 మందికి పెరిగిన మృతులు

PPPసిద్దిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రజ్ఞాపూర్ జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో 10 మంది మృతి చెందారు. రెండు లారీలు, బస్సు, ఓ క్వాలీస్…మొత్తం నాలుగు వాహనాలు ఒకదానికి ఒకటి ఢీ కొన్నాయి. దీంతో రెండు లారీల మధ్య క్వాలీస్ ఇరుక్కు పోయింది. అయితే.. క్వాలీస్ లో ప్రయాణిస్తున్న నలుగురు స్పాట్ లోనే చనిపోయారు. మరోకొంత మంది పరిస్థితి విషమంగా ఉంది. అయితే ఘటన స్థలానికి చేరుకున్న అధికారులు….గాయాలైన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

మరోవైపు ప్రమాదంపై దిగ్బ్రంతి వ్యక్తం చేశారు సీఎం కేసీఆర్. ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు ప్రగాడ సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు.

Posted in Uncategorized

Latest Updates