చంచల్ గూడ జైలులో ఖైదీ సూసైడ్

susudeహైదరాబాద్ చంచల్‌ గూడ జైలులో ఓ విచారణ ఖైదీ సూసైడ్ చేసుకున్నాడు. ఈ ఘటన ఆదివారం రాత్రి (జూన్-24) జరిగింది. దొంగతనం కేసులో విచారణ ఖైదీగా ఉన్న శ్రీహరి అనే యువకుడు జైలులో లుంగీతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మహబూబ్ నగర్ జిల్లా, నవాబుపేట మండలం, గురుకుంట గ్రామానికి చెందిన శ్రీహరిని జూన్ 18న  అరెస్టు చేశారు పోలీసులు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు తెలిపారు పోలీసులు. పోస్ట్ మార్టం కోసం డెడ్ బాడీని ఉస్మానియా హస్పిటల్ కి తరలించారు. అయితే శ్రీహరి గతంలో తన తల్లి హత్య కేసులో పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్నాడని, ఇప్పుడు అరెస్ట్ కావడంతోనే అవమానంతో సూసైడ్ చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు పోలీసులు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Posted in Uncategorized

Latest Updates