చందాకొచ్చర్ క్విడ్ ప్రో కో : ICICI బ్యాంక్ పై సీబీఐ విచారణ

iciciవీడియోకాన్ కంపెనీకి అప్పులిచ్చి.. దానికి ప్రతిఫలంగా ICICI బ్యాంక్ సీఈవో చందాకొచ్చర్ భర్త, మరిది కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారనే వివాదంపై సీబీఐ విచారణ వేగవంతం చేసింది. క్విడ్ ప్రో కో కింద ఈ వ్యవహారాన్ని విచారణ చేస్తున్నారు. వీటితోపాటు 3వేల 250 కోట్ల రూపాయల కుంభకోణంపైనా సీబీఐ విచారణ చేపట్టింది. ఈ క్రమంలోనే చందా కొచ్చర్ భర్త దీపక్ కొచ్చర్ తోపాటు వీడియోకాన్ ఎండీ వేణుగోపాల్ ధూత్ పై విచారణ చేపట్టింది. ముంబై విమానాశ్రయంలో దీపక్ సోదరుడు రాజీవ్ కొచ్చర్ ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

ఈ క్రమంలోనే ICICI బ్యాంక్ బోర్డ్ నామినీగా ఉన్న అమిత్ అగర్వాల్ ను తొలగించింది ప్రభుత్వం. ఆయన స్థానంలో రంజన్ ను నియమించింది. ప్రస్తుతం రంజన్.. ఫైనాన్షిల్ సర్వీసెస్ వింగ్ జాయింట్ సెక్రటరీగా ఉన్నారు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. బ్యాంక్ సీఈవో చందా కొచ్చర్ ను కూడా సీబీఐ ప్రశ్నించే అవకాశం ఉంది.

Posted in Uncategorized

Latest Updates