చంద్రగ్రహణం ఎఫెక్ట్: రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల మూసివేత

చంద్ర గ్రహణం సందర్భంగా రాష్ట్రంలో ప్రధాన ఆలయాలన్నింటినీ అర్చకులు మూసివేశారు. ఇవాళ (శుక్రవారం) రాత్రి 10:45 గంటలకు ప్రారంభమై శనివారం తెల్లవారుజామున 4:59 గంటలకు ముగుస్తుంది. ఈ క్రమంలో ఆలయాలను మూసివేశారు. గ్రహణం పూర్తి అయిన తర్వాత ఆలయాలను తెరవనున్నారు అర్చకులు.

సంపూర్ణ  చంద్రగ్రహణం  సందర్బంగా  ప్రసిద్ధ  పుణ్యక్షేత్రం  వేములవాడ  శ్రీ రాజ రాజేశ్వర  స్వామి  అలయాన్ని మూసివేశారు  అధికారులు. ప్రధాన  ఆలయంతో పాటు… అనుబంద ఆలయాలు  బద్దిపోచమ్మ, భీమేశ్వర స్వామి,  నగరేశ్వర స్వామి ఆలయాల్లో  మహానివేదన  తర్వాత..ద్వార  బంధన కార్యక్రమం  నిర్వహించారు. రేపు (శనివారం,జూలై-28) తెల్లవారు  జామున …సంప్రోక్షన తర్వాత  సుప్రభాత సేవతో  దర్శనాలు తిరిగి  ప్రారంభం కానున్నాయి.

సంపూర్ణ  చంద్రగ్రహణం  సందర్భంగా  సిద్దిపేట జిల్లాలోని… శ్రీ  కొమురవెళ్లి  మల్లికార్జున స్వామి  ఆలయాన్ని మూసివేశారు  అధికారులు. మధ్యాహ్నం వరకు  భక్తులకు  దర్శనం  కల్పించిన  అధికారులు….తర్వాత గర్భగుడి,  ప్రధాన ఆలయ  తలుపులు మూసివేశారు.. శనివారం ఉదయం  6 గంటలకు  ఆలయాన్ని తెరిచి…సంప్రోక్షణ  పూజల  తర్వాత…. భక్తులకు  దర్శనాలు  కల్పిస్తారు.

చంద్రగ్రహణం  కారణంగా…నిర్మల్ జిల్లా  బాసర సరస్వతిదేవి  ఆలయం మూతపడింది. శుక్రవారం(జూలై-27) మధ్యాహ్నం అమ్మవారికి  నివేదన, హారతి  ఇచ్చిన  అర్చకులు….12 గంటల 50 నిమిషాలకి  …. ప్రధాన  ఆలయంతో పాటు అనుబంధ  ఆలయాలను  మూసివేశారు.  రేపు(శనివారం) ఉదయం 5 గంటలకు  అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, పూజల తర్వాత  భక్తులను దర్శనానికి  అనుమతించనున్నారు.

జగిత్యాల జిల్లా  ధర్మపురి  నరసింహుడి  ఆలయాన్ని మూసివేశారు.  చంద్రగ్రహణం సందర్భంగా  ఇవాళ(శుక్రవారం) మధ్యాహ్నం  నుంచే  దర్శనాలను  నిలిపివేశారు.  రాత్రి 11.54  గంటలకు  ప్రారంభమైయ్యే  గ్రహణం శనివారం తెల్లవారుజామున  3.49 వరకు  ఉంటుందని  చెప్పారు ఆలయ  అర్చకులు. మధ్యాహ్నమే  స్వామివారి సన్నిధిలో  అభిషేకాలు అర్చనలు ,నిత్యా పూజలు  పూర్తిచేసి…ప్రధానాలయంతో పాటు  అనుబంధ ఆలయాలను  మూసివేశారు. తిరిగి  శనివారం ఉదయం  ఆలయ సంప్రోక్షణ  తర్వాత  పూజలు నిర్వహిస్తామన్నారు.

Posted in Uncategorized

Latest Updates