చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తా : కేసీఆర్

తెలుగు రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం టీఆర్ఎస్ తనవంతు కృషి చేస్తుందని చెప్పారు గులాబీ బాస్ , సీఎం చంద్రశేఖర్ రావు. తెలుగు ప్రజలు బాగుండాలనే చంద్రబాబుతో గతంలో చెప్పాలని అన్నారు. “ఆంధ్రప్రదేశ్ నుంచి మాకు ఇవాళ లక్ష ఫోన్లు వచ్చాయి. కట్టలకట్టలు మెసేజ్ లు, టెలిగ్రామ్ లు కూడా వస్తున్నాయి. మా ఫోన్లు పగిలిపోయే పరిస్థితి ఉంది. మీరు ఏపీ రాజకీయాల్లో కలగజేసుకోవాలని అడుగుతున్నారు. దేశ రాజకీయాలు బాగు చేసే క్రమంలో.. తప్పకుండా  తెలుగు ప్రజల గౌరవం పెరగాలంటే కలిసి పనిచేయాల్సిందే” అన్నారు. చంద్రబాబు తెలంగాణకు వచ్చి పనిచేసినప్పుడు తాను అభ్యంతర పెట్టలేదని… రేపు తాము కూడా ఆంధ్రకు వెళ్లి పనిచేస్తామని.. అప్పుడు ఎలా ఉంటుందో చూడాలని చెప్పారు కేసీఆర్. “బర్త్ డే ఫంక్షన్ కు వెళ్లినప్పుడు రిటర్న్ గిఫ్ట్ లు ఇస్తాం కదా.. అలాగే చంద్రబాబుకు కూడా మేం రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం. ఇవ్వకపోతే తెలంగాణ ప్రజలకు సంస్కారం లేదంటారు. అది ఎలా ఉంటుందో మీరే చూస్తారు” అన్నారు కేసీఆర్. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సందర్భంగా.. తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు కేసీఆర్. బర్త్ డే రిటర్న్ గిఫ్ట్ అని చెప్పగానే… ఆడిటోరియం దద్దరిల్లేలా అందరూ గొల్లున నవ్వారు.

ఏ నియోజకవర్గంలో ఎవరు గెలిచారు..? కింద లింక్ క్లిక్ చేయండి

Telangana Assembly Election Results 2018 Live Updates

Latest Updates