చంద్రబాబుపై కేటీఆర్ ట్వీట్స్ : మహాకూటమి కాదు.. మహాఘటియా బంధన్

ఏపీ సీఎం చంద్రబాబుపై ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు మంత్రి కేటీఆర్. మంగళవారం(అక్టోబర్-9)న సాయంత్రం వరుస ట్వీట్లతో కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్‌ ను ఉద్దేశించి గతంలో బాబు చేసిన ట్వీట్లను.. కేటీఆర్ పోస్ట్ చేశారు. అవినీతి కాంగ్రెస్ నుంచి దేశాన్ని విముక్తి చేయడమే తమ లక్ష్యమని గతంలో చంద్రబాబు చేసిన ట్వీట్లను కేటీఆర్ గుర్తుచేశారు. నాడు కాంగ్రెస్ పార్టీని ఇటాలియన్ మాఫియా రాజ్‌తో పోల్చిన చంద్రబాబు.. ఇప్పుడదే ఇటాలియన్ మాఫియా రాజ్‌తో ఎలా జతకట్టారని విమర్శించారు. అందుకే అది మహాకూటమి కాదు.. మహాఘటియా బంధన్ అని కేటీఆర్ అభివర్ణించారు. తెలంగాణ ఏర్పాటుకు అంగీకరించడం వల్లే 2004లో కాంగ్రెస్‌తో.. 2009లో టీడీపీతో టీఆర్‌ ఎస్ పొత్తుపెట్టుకుందని వివరించారు. టీడీపీ-కాంగ్రెస్ మాత్రం అవకాశవాదం.. అధికార దాహంతోనే ఒక్కటయ్యాయని ట్వీట్ చేశారు మంత్రి కేటీఆర్.

Posted in Uncategorized

Latest Updates