చంద్రబాబు ఐరన్ లెగ్గు.. నీతో పొత్తా.. బతికుండగా కల్వ : కేసీఆర్

వనపర్తి : వనపర్తి జిల్లా నాగవరం గ్రామంలో ప్రజాఆశీర్వాద సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి కేసీఆర్.. ఏపీ సీఎం, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుపై నిప్పులు చెరిగారు. పాలమూరు జిల్లాను చంద్రబాబు.. 9 ఏళ్లు దత్తత తీసుకున్నాడని… చివరకు గుండెల మీద గుద్ది పోయాడని అన్నారు. అంతటా పునాదిరాళ్లు పాతిపోయాడన్నారు. సమైక్య పాలకులు పాతిన పునాదిరాళ్లు తీస్కపోయి.. కృష్ణాలో పడేస్తే ఓ డ్యామ్ తయారైతదని చెప్పేవాడనిని గుర్తుచేశారు.

మోడీ, కేసీఆర్ కలిసిపోయారని చంద్రబాబు విమర్శిస్తున్నాడని… మోడీతో జత కడితే తనకు వచ్చే లాభం ఏంటని ప్రశ్నించారు.  చంద్రబాబును వేధించాల్సిన అవసరమే తెలంగాణకు లేదన్నారు. “ నువ్ సక్కటి మనిషివని నిన్న వేధిస్తమా మేం. ఓటుకు నోటు కేసు దొంగతనంల నీ వాయిస్ లేదా.. నువ్వు మాట్లాడింది నిజం కాదా. నువ్వు పంపితివి. వాడెవడో బుడర్ ఖాన్ గాడు దొరికే. ఇగ నిన్ను వేధించాల్సిన అవసరం మాకేంది” అన్నారు కేసీఆర్.

తెలుగు ప్రజలు కలిసుండాలని.. పొత్తుకు పిలిస్తే స్పందించలేదని అన్న చంద్రబాబు విమర్శలపై ఘాటుగా రియాక్టయ్యారు కేసీఆర్. తెలుగు పేరుతోనే చంద్రబాబు తెలంగాణ ప్రజల్ని దోచుకున్నాడని విమర్శించిన కేసీఆర్.. చంద్రబాబుతో పొత్తా.. బతికుండగా కల్వ. నీ అడుగు పడితే… పచ్చని చెట్టు భగ్గుమంటది. ఐరన్ లెగ్గు నీది.

కూటమా.. గూటమా… దా.. నీ దమ్మేందో .. మా దమ్మేందో చూసుకుందాం.. అని అన్నారు.

Posted in Uncategorized

Latest Updates