చంద్రుడిపై కాలు పెట్టి తీరుతాం : ఇస్రో

కష్టమైనా చంద్రుడిపై కాలు మోపి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు ఇస్రో ఛైర్మన్ శివన్. మిషన్ చంద్రయాన్-2 ద్వారా ఎవరూ పాదం మోపని ప్రాంతంలో అడుగు పెట్టబోతున్నామని తెలిపారు. వచ్చే ఏడాది అత్యంత చౌక ఉపగ్రహ వాహక నౌక ఎస్ఎస్ఎల్వీకి రూపకల్పన చేస్తున్నామన్నారు. ఇంటర్నెట్ వాడకంలో ప్రపంచంలోనే భారత్ రెండో స్థానంలో ఉందని చెప్పారు. బ్యాండ్ విడ్త్‌ లో 76వ స్థానంలో ఉన్నామన్నారు. త్వరలోనే 100 జీబీపీఎస్ వేగాన్ని దేశమంతటా విస్తరిస్తామన్నారు. రానున్న నాలుగేళ్లలో 50 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపుతామని వెల్లడించారు.

Posted in Uncategorized

Latest Updates