చంద్రోదయం ఫస్ట్ లుక్ రిలీజ్

బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ఇప్పడంతా బయోపిక్ ల హవా కొనసాగుతోంది.ఇప్పటివరకూ ఫిల్మ్, స్పోర్ట్స్ పర్సనాలిటీలపైనే ఎక్కువగా బయోపిక్ లు తెరకెక్కాయి. అయితే ట్రెండ్ మార్చి ఇప్పుడు పొలిటీషన్లపై బయోపిక్ లు మొదలుపెట్టేశారు మన దర్శకులు. ఇప్పటికే NTR, YSR, తెలంగాణ సీఎం కేసీఆర్ బయోపిక్ లు షూటింగ్ దశలో ఉన్నాయి. ఈ బయోపిక్ ల లిస్ట్ లో ఏపీ సీఎం చంద్రబాబు కూడా చేరిపోయారు. చంద్రోయం పేరుతో చంద్రబాబు బయోపిక్ తెరకెక్కుతోంది. చంద్రోదయం ఫస్ట్ లుక్ ను సోమవారం(సెప్టెంబర్-24) రిలీజ్ చేసింది మూవీ టీమ్. పి.వెంకటరమణ దర్శకత్వంలో జి.జె.రాజేంద్ర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ ఏడాది అక్టోబర్ లో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ కానుంది.

Posted in Uncategorized

Latest Updates