చంపే హక్కు ఎవరిచ్చారు : కుక్కల మృతిపై వేగంగా దర్యాప్తు

ఘట్ కేసర్ : సంస్కృతి టౌన్‌ షిప్ కాలనీలో ఇటీవల 60కిపైగా కుక్కలను విషం ఇచ్చి చంపిన ఘటనలో నిన్న (అక్టోబర్-9) పోలీసులు విచారణను వేగవంతం చేశారు పోలీసులు. కుక్కలను చంపి, కాల్చిన స్థలాన్ని పోలీసులు సందర్శించి.. కుక్కల అస్తిపంజరాలు, ఎముకలను వెలికితీసి పంచనామా నిర్వహించారు. అక్టోబర్- 5న రాత్రి 11 గంటల తర్వాత కొందరు వ్యక్తులు కాలనీలో సంచరిస్తున్న 60కి పైగా కుక్కలకు విషం ఇచ్చి చంపారు. వాటిని కాలనీలోని శ్రీగిరి వేంకటేశ్వర స్వామి దేవాలయం వెనుక ఉన్న చెత్త డంపింగ్‌ యార్డులో వేసి తగులబెట్టినట్లు.. జంతు సంరక్షణ సమితి పోలీసుల దృష్టికి తెచ్చింది. దీంతో పోలీసులు డంపింగ్‌ యార్డును పరిశీలించగా.. ఐదారు కుక్కల కళేబరాలు బయటపడ్డాయి.

పోచారం పశువైద్యాధికారి కాంత్యాయని ఆధ్వర్యంలో కుక్కల కళేబరాలు సేకరించి పంచనామా నిర్వహించారు. చాలా వరకు కుక్కల కళేబరాలు కాలిపోవడంతో బూడిదగా మారిందని జంతు సంరక్షణ సమితి సభ్యురాలు ప్రవల్లిక తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రఘువీర్‌రెడ్డి తెలిపారు. కుక్కుల బెడద ఎక్కువగా ఉంటే..పోలీసులకు, బ్లూక్రాస్ లాంటి సంస్థలకు ఫిర్యాదు చేయాలి కానీ..చంపే హక్కు ఎవరిచ్చారని మండిపడింది జంతు సంరక్షణ సమితి.

Posted in Uncategorized

Latest Updates