చక్కగా అర్థం అవుతాయి : జీవోలన్నీ ఇక తెలుగులోనూ

Shailendra-Kumar-Joshiరాష్ట్ర ప్రభుత్వం జారీ చేసే ఉత్తర్వులు (G.O) ఇక తెలుగులోనూ జారీ అయ్యే విధంగా చర్యలు తీసుకుంటుంది. అన్ని శాఖల అధికారులు ఫాలో కావాలని ఆదేశించింది ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె.జోషి. ఈ విషయంలో అన్ని శాఖల అధికారులతో పాటు అనువాద విభాగంలోని అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆయా శాఖల ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాలు, అభివృద్ధి పనులు, పథకాలు సామాన్యులకు కూడా అర్థం అయ్యే విధంగా ఉత్తర్వులను మాతృ భాషలో ఇవ్వనున్నారు.

జీవోలను తెలుగులో ఇవ్వటంతోపాటు.. అందుకు తగిన విధంగా వెబ్ సైట్లలో మార్పులు చేయాలని సూచించారు. ఇంగ్లీష్ తోపాటు తెలుగులోనూ ఉత్తర్వులు అందరికీ అందుబాటులో ఉంచాలన్నారు. ఈ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు సీఎస్. అన్ని శాఖలు సమన్వయం చేసుకుని.. ఇందుకు తగ్గట్టు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు.

Posted in Uncategorized

Latest Updates