చట్టంలోని హామీలు ఎందుకు నెరవేర్చరు : కేకే

విభజన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత కేంద్రానికి ఉందన్నారు TRS ఎంపీ కేకే.  మంగళవారం (జూలై-24) రాజ్యసభలో మాట్లాడారు ఎంపీ కేకే. విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలన్నారు. హైకోర్టును విభజిస్తే తెలంగాణలో ఉద్యోగాలు భర్తీ అవుతాయని చెప్పారు. వాటాకింద తెలంగాణకి రావాల్సిన విద్యుత్ ను ఏపీ ఇవ్వటం లేదన్నారు. హైకోర్టు గురించి ఎప్పుడు అడిగినా కేంద్ర న్యాయశాఖ నుంచి సమాధానం రాని పరిస్థితి ఉందన్నారు. హైకోర్టును ఇప్పటి వరకు ఎందుకు విభజించలేదని ప్రశ్నించారు. నీటి కేటాయింపుల్లో నిర్లక్ష్యం వల్ల మా రాష్ట్రం ఎంతో నష్టపోతుందన్నారు. బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరాన్ని జాతీయ ప్రాజెక్ట్ కు గుర్తించాలని కోరారు.

విద్యుత్ విషయంలో ఛత్తీస్ గడ్ నుంచి కొనుగోలు చేసి, తెలంగాణలో 24 గంటల కరెంట్ ను ఇస్తున్నామని చెప్పారు. ఖమ్మం జిల్లా నుంచి విడదీసిన ఏడు మండలాలను తెలంగాణలో కలపాలని కేంద్రాన్ని కోరారు కేకే.

Posted in Uncategorized

Latest Updates