చత్తీస్‌ఘడ్‌లో ఎన్ కౌంటర్: ఏడుగురు మావోలు మృతి

చత్తీస్‌ఘడ్‌లో నక్సల్స్, భద్రతా దళాల మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ కాల్పుల్లో ఏడుగురు మవోలు మృతిచెందారు. అందులో ముగ్గురు మహిళలు ఉన్నారు. తిమెనార్ ఫారెస్ట్ ఏరియా నుంచి నక్సల్స్ మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. దంతెవాడ-బీజాపుర్ బోర్డర్‌లో జరిగిన ఎదురుకాల్పుల్లో… డిస్ట్రిక్ రిజర్వ్ గార్డ్, ఎస్‌టీఎఫ్ బృందాలు పాల్గొన్నాయి. నక్సల్స్ స్థావరాల నుంచి రెండు ఇన్సాస్ రైఫిళ్లు, రెండు 303 రైఫిళ్లు, ఒకటి 12 బోర్ రైఫిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. అటవీ ప్రాంతంలో ఇంకా ఎన్‌కౌంటర్ కొనసాగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇవాళ (గురువారం,జూలై-19) ఉద‌యం 6 గంట‌ల‌కు ఎదురుకాల్పులు జ‌రిగాయి.

 

Posted in Uncategorized

Latest Updates