చదరంగం కలిపింది ఇద్దరినీ

pentalaచదరంగంలో రాజుని కట్టేస్తేగానీ ఆట ముగియదు. ఎంతోమందిని ఓడించిన చదరంగపు రారాజు పెంటాల హరికృష్ణ కూడా ఇప్పుడు తన బాల్య స్నేహితురాలి చేతిలో బందీ అయ్యాడు. ఆ అమ్మాయే సెర్బియాకు చెందిన నరెజ్దా స్టొయనోవిచ్‌. ఈ ప్రేమ జంట మార్చి 3న హైదరాబాద్‌లో పెళ్లితో ఒకటవనుంది. ఈ సందర్భంగా తన నెచ్చెలి నరెజ్దా, ఆమెతో తనకున్న అనుబంధం గురించి మీడియాతో పంచుకున్నాడు హరికృష్ణ.

నరెజ్దా తన చిన్ననాటి స్నేహితురాలేనని.. వాళ్లది సెర్బియాలోని బెల్‌గ్రేడ్‌ అని తెలిపాడు. ఆమెకు ఒక తమ్ముడు, ఒక చెల్లి! ఆమె తల్లి వైద్య రంగంలో ఉందని… తండ్రి వ్యాపారవేత్త. నరెజ్దా ఎకనామిక్స్‌ గ్రాడ్యుయేషన్‌ చేసింది. చెస్‌ ఫెడరేషన్‌ ఫిడే ఆర్బిటర్‌. దాన్లో ఇన్‌స్ట్రక్టర్‌ తోపాటు ఫిడే మాస్టర్‌ టైటిల్‌ ఫర్‌ ఉమెన్‌ కోర్సూ పూర్తి చేసిందన్నాడు. నరెజ్దా సెర్బియాలో జూనియర్‌ చెస్‌ ఛాంపియన్‌. అలా పూర్తిగా చదరంగం చుట్టూ తిరిగే కెరీర్‌ ఆమెది. ఆ కెరీర్‌లో భాగంగానే 1996 నుంచి 2000 మధ్యలో, టీనేజ్‌ వయసు నుంచే జూనియర్‌ టోర్నమెంట్లు, వరల్డ్‌ టోర్నమెంట్లు, ఇంటర్నేషనల్ ఈవెంట్లలో తాము కలిసి పాల్గొనేవాళ్లమన్నాడు. కలిసి పోటీల్లో పాల్గొనటం, కలిసి ప్రయాణాలు చేయటం….అలా కొన్నేళ్ల స్నేహంతో ఒకరికొకరం పూర్తిగా అర్థమయ్యామని.. ఒకరి అభిప్రాయాల్ని మరొకరు గౌరవించుకుంటూ.. ఒకరి గురించి మరొకరం జాగ్రత్త తీసుకుంటామన్నాడు. అలా కాలక్రమేణా, ఇద్దరి మనసుల్లో ప్రేమ ఉందని గ్రహించినట్లు చెప్పాడు.

అయితే అందరు ప్రేమికుల్లా I LOVE U  లాంటివి తమ మధ్య లేవని.. అసలు అలా చెప్పుకోవలసిన అవసరం ఉందని  తమకు అనిపించలేదని తెలిపాడు. ఒకరంటే ఒకరికి ఇష్టం, ఒకరి మీద మరొకరికి ప్రేమ ఉన్నట్టు ఇద్దరూ గ్రహించినప్పుడు, బయటికి చెప్పుకోవలసిన అవసరం ఏముందని.. అయినా ఇద్దర్లో ఎవరో ఒకరు ముందడుగు వేయాలి కాబట్టి, తనను ఇష్టపడుతున్నట్టు, పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నట్టు ముందుగా తానే చెప్పానని.. తనూ ఒప్పుకుందన్నాడు. దీంతో మా ఇద్దరి వివాహానికి పెద్దలు ఒప్పుకోవడంతో తమ ప్రేమ సక్సెస్ అయ్యిందని చెప్పుకొచ్చాడు హరికృష్ణ.

Posted in Uncategorized

Latest Updates