చదివి తీరాల్సిందే : MBBS మధ్యలోనే వదిలేస్తే రూ.5లక్షల ఫైన్

MBBS STUDENTS FINEమెడిసిన్ లో సీటు కావాలంటే లక్షలు పోస్తారు. ఐదు సంవత్సరాల MBBS కోర్సు కోసం దేశంలో మంచి డిమాండ్ ఉంది. అయితే లక్షల ఫీజులు కట్టి, కోర్సు పూర్తిచేయకుండానే.. మధ్యలోనే విదిలేస్తున్నారట కొంతమంది మెడిసిన్ స్టూడెంట్స్. ఈ క్రమంలోనే కొన్ని మెడిసిన్ విద్యా సంస్థలు కఠిన రూల్స్, బాండ్స్ ను అమలుపరుస్తున్నారు.

MBBS మధ్యలోనే ఆపేస్తే రూ.5లక్షల ఫైన్ విధించనున్నట్లు ప్రకటించాయి. హర్యానాలో వైద్య విద్యను అభ్యసించే విద్యార్థులు ఇకపై రూ.5 లక్షలు, రూ.7.5 లక్షల పూచీకత్తుతో కూడిన బాండ్లను సమర్పించాల్సి ఉంటుంది. కోర్సు పూర్తికాకముందే కాలేజీ నుంచి వెళ్లిపోనంటూ ఇద్దరు వ్యక్తుల పూచీకత్తుతో కూడిన పత్రాలనూ సమర్పించాలి. ఈ కొత్త రూల్ 2018-19 విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి రానుంది. మెడిసిన్ స్టడీలో సీటు పొందిన తర్వాత విద్యార్థులు కోర్సు పూర్తికాకముందే మధ్యలో మానేస్తే.. ఈ బాండ్లను తిరిగి ఇవ్వరు.

వైద్య విద్య, పరిశోధన విభాగం అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. MBBS, BDS విద్యార్థులు రూ.5 లక్షల బాండ్లను, MD, MS విద్యార్థులు రూ.7.5 లక్షల బాండ్లను సమర్పించాల్సి ఉంటుందని చెప్పారు. ఈ కొత్త రూల్ కన్వీనర్ కోటా విద్యార్థులతోపాటు మేనేజ్‌మెంట్ విద్యార్థులకూ వర్తిస్తుందని తెలిపారు. PG చదువుతున్న విద్యార్థులు ఒకవేళ మధ్యలో మానేస్తే మూడేండ్ల వరకు ఏ కాలేజీలోనూ అడ్మిషన్ ఇవ్వరని చెప్పారు. మెడిసిన్ స్టూడెంట్స్ మధ్యలోనే కాలేజీ వదిలేస్తున్న క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

Posted in Uncategorized

Latest Updates