చదివేది ఇంటర్ : ఇంట్లో నుంచి రూ.13 లక్షలు, కారుతో పరారైన కొడుకు

న్యూఢిల్లీ : బుధ్దిగా చదువుకుని తమ పేరు నిలబెడుతాడనుకున్న కొడుకు చేసిన పనికి తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. చిన్నప్పట్నుంచీ అడిగిందల్లా ఇచ్చి, గారాబంగా పెంచినందుకు తట్టుకోలేని షాక్ ఇచ్చాడు. ఇంట్లో నుంచి రూ.13 లక్షలతో పాటు..కారుతో కనిపించకుండా పోయాడు. విలాసాలకు అలవాటుపడి జల్సాల కోసమే ఇలా చేసి ఉంటాడని అనుమానిస్తున్నారు పోలీసులు. ఈ సంఘటన ఢిల్లీలో డిసెంబర్- 19న జరగగా పోలీసులు డిసెంబర్-26న మీడియాకు చెప్పారు.

వివరాల్లోకి వెళితే..

ఢిల్లీకి చెందిన ఓ బడా వ్యాపారస్ధుల కుమారుడు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. కాలేజీ అయిపోయాకా స్పెషల్ క్లాస్ అంటూ ఫ్రెండ్స్ తో విచ్చలవిడిగా తిరిగేవాడు. ఓ గర్ల్ ఫ్రెండ్ కూడా ఉంది. ఇంట్లో లేట్ అయ్యిందని పదేపదే తల్లిదండ్రులు అడగడంతో..జల్సాలకు అలవాటుపడ్డ ఆ బాలుడు డబ్బు, కారుతో ఉడాయించాడు. కుమారుడి ఆచూకీ కోసం తల్లిదండ్రులు గాలిస్తున్నారు.  పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. ఇంటి నుంచి తీసుకెళ్లిన డబ్బుతో అక్రమ కార్యకలాపాలు కొనసాగించే అవకాశం ఉందని తల్లిదండ్రులు భావిస్తున్నారు.

అయితే తమ అబ్బాయిని అతడి గర్ల్ ఫ్రెండ్ ప్రేరేపించి ఉండొచ్చని అనుమానంతో తల్లిదండ్రులు ఆ అమ్మాయిని విచారించగా.. అతను ఎక్కడ ఉన్నాడో తనకు తెలియదని చెప్పింది. తన గురించి ఎదురు చూడొద్దని.. తాను తిరిగి రానని తల్లిదండ్రులకు కుమారుడు ఫోన్ చేసి చెప్పినట్లు పోలీసులు తెలిపారు. ఇటీవలే తల్లి అకౌంట్ నుంచి రూ. 50 వేలు డ్రా చేసి, తన ఫ్రెండ్ కు సహాయం చేశాడని తోటి విద్యార్ధులు చెప్పినట్లు తెలిపారు పోలీసులు. ఇంటి నుంచి పారిపోయిన విద్యార్థి మొబైల్ చివరగా జైపూర్ లో యాక్టివ్ గా ఉందని.. ఆ తర్వాత స్విచ్ఛాఫ్ అయిందన్నారు.

Posted in Uncategorized

Latest Updates