పరీక్ష రాసిన ఎమ్మెల్యే

హన్మకొండ: చదువుకు వయసుతో పనిలేదు అని నిరూపించారు ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. 42 సంవత్సరాల వయసున్న ఆయన ఇవాళ పరీక్ష రాశారు. హన్మకొండలోని ఆదర్శ లా కాలేజీలో జీవన్ రెడ్డి LLM ఎగ్జామ్ రాశారు. ఆయన ప్రస్తుతం డిస్టెన్స్ విధానంలో LLM చదువుతున్నారు. LLM మూడో సెమిస్టర్ పరీక్షల కోసం సోమవారం హన్మకొండకు వచ్చారు.

ఇప్పటికే ఆయన LLM ఫస్ట్ ఇయర్ పూర్తి చేసుకొని అందులో పాస్ అయ్యారు. సెకండ్ ఇయర్ ఎగ్జామ్ రాస్తున్నట్లు ట్విట్టర్ ద్వారా తెలుపుతూ.. నా కృషి, మీ ఆశీర్వాదాలతో గత రెండు సెమిస్టర్ పరీక్షలు పాసయ్యానని ట్వీట్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు పోస్ట్ చేశారు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి.

Latest Updates