చనిపోతూ.. ఐదుగురికి ప్రాణదాతగా నిలిచింది

హైదరాబాద్: బ్రెయిన్‌ డెడ్‌ అయిన ఓ యువతి అవయవాలను ఆమె ఫ్యామిలీమెంబర్స్ దానం చేసి, మరికొందరి జీవితాలను నిలబెట్టారు. మెదక్ జిల్లా ఘట్‌ కేసర్ మండలం, అంకుశాపూర్ గ్రామానికి చెందిన గృహిణి చింతకింది భానుప్రియ(29). ఆమెకు భర్త అరవింద్, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఈ డిసెంబర్ 1న భానుప్రియకు తీవ్ర తలనొప్పితో అపస్మారకస్థితిలో పడిపోయింది. కుటుంబసభ్యులు సికింద్రాబాద్‌ లోని యశోద హస్పిటల్ లో అడ్మిట్ చేశారు.

మెదడులో రక్తస్రావం జరిగినట్లు నిర్ధారించిన న్యూరో ఫిజీషియన్లు.. చికిత్స పొందుతుండగానే ఆమె బ్రెయిన్‌డెడ్‌ కు గురైనట్లు తెలిపారు. విషయం తెలిసి కన్నీరుమున్నీరయ్యారు ఫ్యామిలీ మెంబర్స్. అయితే ..బ్రేయిన్ డెడ్ అయిన భానుప్రియ గురించి.. హస్పిటల్ లోని జీవన్‌ దాన్ ప్రతినిధులు కుటుంబ సభ్యులను కలిసి అవయవదానం విశిష్టతను వివరించగా, వారు అందుకు అంగీకరించారు. భానుప్రియ నుంచి కాలేయం, రెండు మూత్రపిండాలు, రెండు కార్నియాలను సేకరించారు. తన భార్య మరణించినా.. ఐదుగురికి ప్రాణదాతగా నిలిచినందుకు గర్వంగా ఉందని ఏడ్చేశాడు భానుప్రియ భర్త.

 

Posted in Uncategorized

Latest Updates