చనిపోయి సాధించుకుంది : ప్రియురాలి శవానికి తాళి కట్టిన ప్రియుడు

true-love-storyవాళ్లిద్దరూ ప్రేమించుకున్నారు. ఆ అమ్మాయి గాఢంగా ప్రేమించింది. బతికినా, చచ్చినా నీతోనే అని తెగేసి చెప్పింది. ప్రేమ వ్యవహారం ఇంట్లో చెప్పింది. కుటుంబ సభ్యులు ససేమిరా అన్నారు. చచ్చినా ప్రేమించిన కుర్రోడితో పెళ్లి చేసేది లేదని తెగేసి చెప్పారు పెద్దలు. ప్రియుడు లేని జీవితాన్ని ఊహించుకోలేకపోయింది. ఉరేసుకుని చనిపోయింది. ఆ తర్వాత ఆ అమ్మాయి మృతదేహానికి ప్రియుడితో తాళి కట్టించారు. తమిళనాడులో జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరు ప్రాంతానికి చెందిన అమ్మాయి.. ఓ యువకుడిని ప్రేమించింది. వాలెంటైన్స్ డే సందర్భంగా ఇంట్లో పెద్దలను ఒప్పించి పెళ్లికి అంగీకారం తీసుకోవాలని భావించారు. అయితే అందుకు అమ్మాయి తరపు కుటుంబ సభ్యులు నిరాకరించారు. పెళ్లికి ససేమిరా అన్నారు. తీవ్ర మనోవేదనతో ఫిబ్రవరి 10వ తేదీ రాత్రి ఇంట్లో ఉరివేసుకుని చనిపోయింది. ఆత్మహత్యకి ముందు లేఖ రాసింది. ప్రియుడితో తాళి కట్టించుకోవాలన్న తన కోరిక తీరలేదని.. కుటుంబ సభ్యులు నెరవేర్చాలని కోరింది. దీంతో చలించిపోయిన అమ్మాయి కుటుంబ సభ్యులు.. ప్రియుడిని వెతికి పట్టుకున్నారు. ఫిబ్రవరి 11వ తేదీ ఆదివారం.. అమ్మాయి మృతదేహానికి తాళి కట్టించారు. అబ్బాయి కూడా అమ్మాయిపై ఉన్న ప్రేమతో కాదనలేకపోయాడు. నిర్జీవంగా పడి ఉన్న ప్రియురాలి మెడలో మూడు ముళ్లు వేశాడు. తాళిని కళ్లకు అద్దాడు. పసుపు రాశాడు. నుదిటపై తిలకం దిద్దాడు. ఇదంతా చూడటానికి ఆ కళ్లు లేవు కానీ.. ఆత్మ అయితే శాంతించింది కదా.. తమిళనాడులో సంచలనంగా మారిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది…

Posted in Uncategorized

Latest Updates