చరణ్ స్పీచ్ వింటే రాజకీయాల్లోకి వస్తాడేమో అనిపిస్తుంది :  కేటీఆర్

హైదరాబాద్ : బోయపాటి శీను డైరెక్షన్ లో  రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన సినిమా వినయ విధేయ రామ. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ కు TRS పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. “మెగాస్టార్ చిరంజీవి సముద్రమంతా అభిమానాన్ని, అద్భుతమైన వారసుల్ని ఇండస్ట్రీకి అందించారు. మేము ఎన్నికల్లో మాట్లాడిన దానికంటే ఈ వేదికపై చరణ్ అద్భుతంగా ప్రసంగించాడు.

చరణ్ స్పీచ్ వింటే రాజకీయాల్లోకి వస్తాడేమో అనిపించింది (చమత్కరించాడు). ఈ మధ్యకాలంలో చరణ్ వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. రంగస్థలం షూటింగ్ లో ఉండగా చరణ్‌ను కలిశాను. గడ్డంతో కనిపించిన అతడిని చూసి ఏ సినిమా చేస్తున్నావని అడిగాను. పల్లెటూరి సినిమా చేస్తున్నానని చెప్పగానే సినిమా చూడనని అన్నాను. మా స్నేహితులంతా సినిమా అద్భుతంగా ఉందని చెప్పారు. చరణ్ కెరీర్‌ లో నే అద్భుతమైన అభినయాన్ని కనబరిచిన సినిమా రంగస్థలం.

ఈ మాట మనస్ఫూర్తిగా చెబుతున్నాను. ఎన్నికల సమయంలో నా ప్రతి ప్రసంగంలో ఆ గట్టునుంటావా ఈ గట్టునుంటావా అంటూ ఈ సినిమా పాటలోని డైలాగ్ ను వాడుకున్నాను. మెగా అభిమానులకు ఈ సినిమా పండుగలా ఉంటుంది. సినిమాలో వినయవిధేయ రామ ఎవరూ అని చిరంజీవిని అడిగాను. ట్రైలర్ చూస్తే తెలుస్తుందని ఆయన అన్నారు. ట్రైలర్‌ లో రామ్‌ చరణ్ విధ్వంసరాముడిగానే కనిపిస్తున్నారు. చిరంజీవి నుంచి సంస్కారాన్ని వినయాన్ని విధేయాన్ని అలవర్చుకున్నారు చరణ్. ఇండస్ట్రీలో అద్భుతమైన శక్తిగా ఎదుగుతున్నారు. చనణ్ సినిమా ప్రస్థానం విజయవంతంగా ముందుకు సాగాలని కోరుకుంటున్నాను అని తెలిపారు కేటీఆర్.

Posted in Uncategorized

Latest Updates