చరిత్రలో ఫస్ట్ టైం : రూపాయి విలువ భారీగా పతనం

rupee-downరూపాయి రూపాయి ఏం చేస్తావు అంటే కుటుంబంలో చిచ్చు పెడతా.. బంధువులతో వైరం తెస్తా అంది అంట.. ఇప్పుడు మాత్రం రూపాయి రూపాయి ఏం చేస్తున్నావ్ అంటే.. పడిపోతున్నా.. పనికి రాకుండా పోతున్నా అంటోంది. అవును.. డాలర్ తో రూపాయి మారకం విలువ ఆల్ టైం కనిష్ఠ స్థాయికి చేరింది. దేశచరిత్రలో ఫస్ట్ టైం.. ఇంతలా పతనం అయ్యింది మన రూపాయి విలువ. జూన్ 28వ తేదీ గురువారం ఉదయం ఒక్క డాలర్ తోపోల్చితే.. మన రూపాయి 69.04పైసలకు దిగిపోయింది. అమెరికాతో వాణిజ్య యుద్ధం మొదలుపెట్టినప్పటి నుంచి ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తున్నట్లు చెబుతున్నారు మార్కెట్ వర్గాలు.

భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి, దిగుమతి అయ్యే వస్తువులపై సుంకాలను పెంచాయి రెండు దేశాలు. దీనికితోడు క్రూడ్ ఆయిల్ ధరలు కూడా భారీగా పెరిగాయి. ఈ క్రమంలోనే.. రూపాయి విలువ భారీగా పతనం అవుతుంది. 60శాతం ఇంధనాన్ని మన దేశం దిగుమతి చేసుకుంటోంది. ఇది కూడా రూపాయి విలువ మరింత దిగజారటానికి కారణంగా విశ్లేషిస్తున్నారు నిపుణులు. రూపాయి జీవితకాలంలోనే రూ.69.04కి దిగజారటం ఇదే. ఈ పరిణామాలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రంగంలోకి దిగింది. దిద్దుబాటు చర్యలు చేపట్టింది.

Posted in Uncategorized

Latest Updates