చర్చకి అనుమతి : టీడీపీ అవిశ్వాసానికి కాంగ్రెస్ సపోర్ట్

పార్లమెంట్ లోక్ సభలో టీడీపీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. సభలో 50 మందిసభ్యులకుపైగా తీర్మానాన్ని ఆమోదించటంతో.. నోటీస్ ను స్వీకరించారు స్పీకర్ సుమిత్రామహాజన్. అవిశ్వాసంపై 10 రోజుల్లోగా చర్చించే అవకాశం ఇస్తానని తెలిపారు. దీనిపై పట్టుబట్టిన టీడీపీ.. వెంటనే అవిశ్వాసం నిర్వహించాలని కోరింది. టీడీపీ ఎంపీలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి కాంగ్రెస్ మద్దతు పలికింది. రెండు రోజుల్లోనే అవిశ్వాసంపై చర్చ నిర్వహించాలని.. లోక్ సభ విపక్ష నేత మల్లికార్జునఖర్గే.. స్పీకర్ ను డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానాన్ని స్పీకర్ పరిగణలోకి తీసుకోకపోవడాన్ని ఖర్గే తప్పుపట్టారు. రూల్స్ ప్రకారమే నో కాన్ఫిడేన్స్ పై చర్చ పెడతామన్నారు స్పీకర్. టీడీపీ ఎంపీ కేశినేని నాని ఈ నోటీస్ అందజేశారు.

టీడీపీ ఇచ్చిన అవిశ్వాసం నోటీస్ కు కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించటం, స్పీకర్ పరిగణలోకి తీసుకోవటం చకచకా జరిగిపోయాయి. మోడీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానంపై చర్చను.. శుక్రవారం (జూలై-20) చేపట్టనున్నట్లు బీఏసీ సమావేశంలో తెలిపారు స్పీకర్ సుమిత్రా మహాజన్. ఆ రోజు ప్రశ్నోత్తరాలు రద్దు చేసి.. అవిశ్వాసంపై చర్చ చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. సోమవారం (జూలై-23) రాజ్యసభలో ఏపీ విభజన చట్టంపై స్వల్పకాలిక చర్చ చేపట్టాలని నిర్ణయించారు. టీడీపీ అవిశ్వాస తీర్మానానికి కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు ప్రకటించటంతో.. స్పీకర్‌ ఆమోదించారు.

Posted in Uncategorized

Latest Updates