చర్చలతోనే కశ్మీర్ అంశానికి పరిష్కారం: ఇమ్రాన్ ఖాన్

కశ్మీర్ అంశాన్ని చర్చలతోనే పరిష్కరించుకోవాలన్నారు పాకిస్థాన్ తెహ్రీక్ ఎ ఇన్సాఫ్ పార్టీ చీఫ్ ఇమ్రాన్ ఖాన్. పాక్ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా నిలవడంతో ఆ పార్టీ అధినేత, కాబోయే ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్  మీడియాతో మాట్లాడారు. ఒకరిపై మరొకరు నిందలు వేసుకుంటూ వెళ్తే కుదరదన్న ఇమ్రాన్… ఇండియాతో సత్సంబంధాల కోసం సిద్ధంగా ఉన్నామన్నారు. మీరు అడుగు వేస్తే..తాము కూడా రెండడుగులు వేస్తామని చెప్పారు. మరోవైపు కశ్మీర్ లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందంటూ ..ఆరోపణలు చేశారు ఇమ్రాన్ ఖాన్. 22 ఏళ్లు పడిన శ్రమకు ఇప్పుడు ఫలితం దక్కిందన్నారు. జిన్నా కలలు కన్న పాకిస్థాన్ ను నిర్మిస్తానని చెప్పారు ఇమ్రాన్ ఖాన్.

Posted in Uncategorized

Latest Updates