చర్చలు విఫలం : ఆర్మీసీ సమ్మెపై వెనక్కి తగ్గేది లేదు

TMU-Leadersసమ్మె నోటీసులపై రవాణా మంత్రితో చర్చించారు కార్మిక సంఘం నేతలు. డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని.. సమ్మె విరమించుకోవాలని కోరారు మంత్రి మహేందర్ రెడ్డి. దీనిపై కార్మిక సంఘం నేతలు ససేమిరా అన్నారు. ఉద్యమ సమయంలోనే ఆర్టీసీ  నష్టపోయిందని, సంస్కరణలు చేస్తే లాభాల్లో నడుస్తుందన్నారు అశ్వద్ధామరెడ్డి. ఉద్యమం తర్వాతే ఆర్టీసీ నష్టాల్లోకి వెళ్లిందని.. దానికి బాధ్యతగా ప్రభుత్వమే ఆదుకోవాలని కోరారు. ఆర్టీసీలో ఎన్నికలు జరపాలా.. వద్దా అనేది ప్రభుత్వం ఇష్టం అన్నారు. ఎన్నికలు రద్దు చేస్తే వచ్చే నష్టం ఏం లేదన్నారు.

ఇప్పటికే 3వేల కోట్ల నష్టాల్లో సంస్థ ఉందని.. ప్రతి సంవత్సరం 250 కోట్ల రూపాయలు వడ్డీ భారం ఉందన్నారు. ఇప్పుడు జీతాలు పెంచితే మరో రూ.1,400 కోట్లు నష్టాలు వస్తాయని.. ఆర్టీసీ మనుగడే ఇబ్బందిగా మారుతుందని మంత్రి వివరించారు. కార్మికుల ప్రయోజనాలు ఎంత ముఖ్యమో..  తెలంగాణ ప్రజల సంక్షేమం కూడా అంతే ముఖ్యం అన్నారు మంత్రి. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు, సంస్థ మనుగడపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారని.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు మంత్రి.

Posted in Uncategorized

Latest Updates