చలికాలంలో పిల్లల ఆరోగ్యానికి జాగ్రత్తలు

చలికాలం వంచిదంటే చాలు పిల్లలలో శ్వాసకోశ వ్యాధులు వస్తుంటాయి. ఈ కాలంలో సర్ధీ, జ్వరం లాంటి సమస్యలు పిల్లలకు చిరాకును తెప్పిస్తాయి. దీంతో వాళ్ల రోజూవారి పనులకు ఆటంకం కలుగుతుంది. ఈ క్రమంలో పిల్లల ఆరోగ్యాన్ని కాపాడడం చాలా ముఖ్యం. వారి ఆరోగ్యాన్ని కాపాడటానికి నిపుణులు ఇస్తున్న కొన్ని సూచనలు ఇవే..

చలికాలంలో ముఖ్యమైన మార్పు ఉష్ణోగ్రత పడిపోవడం. పెరిగిన చలితోపాటు, గాలితోడై చలిగాలులు శరీరానికి మరిన్ని ఇబ్బందులు కలిగిస్తాయి. శ్వాసకోశాలలో, సైనస్‌లతో, చర్మంమీద దాని ప్రభావం ఉంటుంది. అందుకుగాను.. పిల్లలకు దుమ్ము..ధూళి సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. చలికాలంలో పిల్లలను ఎక్కువగా బయట ఆడించకూడదు. వారి చర్మం పొడాబారకుండా ఉండేందుకు క్రీములు రాయాలి.

ఈ కాలంలో పిల్లలు బలవర్తకమైన ఆహారాన్ని తినడానికి మొండికేస్తారు. దీంతో ప్రతీరోజు పాలను తప్పక తాగించాలి. పాలు శరీరంలో వేడిని పుట్టించడమే కాకుండా ఆరోగ్యాన్నిస్తుంది. దీంతో పాటే చక్కగా నిద్ర పట్టి… పొద్దున్నే హుషారుగా నిద్ర లేస్తారు.

పిల్లల్ని బయటకు తీసుకువెళ్తుంటే ఉన్ని దుస్తులు వేయండి. ఐస్‌క్రీములు, కూల్ డ్రింక్‌లు వంటివి కొనివ్వడం మానేయాలి. పిల్లల భోజనం తప్పక వేడి వేడిగా తినిపించేందుకే చూడండి.వ్యాధులు, ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉండేందుకు యాంటీ ఆక్సిడెంట్లు, బీటా కెరోటీన్ ఎక్కువగా ఉండే ఆహారాలను ఇవ్వాలి. తాజా కూరగాయలు, ఆకు కూరలు, సూప్స్, క్యారెట్లు, టమాటాలతో వండిన ఆహారాలను ఇవ్వాలి. నట్స్ వంటి వాటిని తినిపించాలి.

Posted in Uncategorized

Latest Updates