చలికాలానికి ఆలివ్‌

ఆలివ్‌ చలికాలంలో ఆలివ్ ఆయిల్ చర్మానికి రక్షణనిస్తుంది. చర్మం  పొడిబారకుండా పనిచేస్తుంది. స్నానం చేసే ముందు శరీరానికి ఆలివ్ ఆయిల్ రాసుకోవాలి. అనంతరం స్నానం చేస్తే చర్మం పొడిబారకుండా మృదువుగా ఉంటుంది. చర్మం తెల్లగా మారకుండా ఉంటుంది. ఈ నూనెలో కొద్దిగా చక్కెర కలిపి చర్మానికి మర్దనా చేస్తే చర్మానికి మృదుత్వం వస్తుంది. ఆలివ్‌‌‌‌‌‌‌‌నూనె చర్మానికే కాదు, వెంట్రుకలకు కూడా బాగా పనిచేస్తుంది. గుడ్డు సొనలో కొద్దిగా ఆలివ్‌‌‌‌‌‌‌‌నూనె కలిపి తలకు రాసు కొని స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల వెంట్రుకలు బలంగా తయారవుతాయి. షాంపూ, కండిషనర్‌లో ఆలివ్‌‌‌‌‌‌‌‌నూనె  కలిపి వాడినా ఫలితం ఉంటుంది. వెంట్రుకలు రాలిపోవడం తగ్గుతుంది. నిమ్మరసం, ఆలివ్‌‌‌‌‌‌‌‌నూనె మిశ్రమంగా చేసి జుట్టుకు పట్టించి తలస్నానం చేస్తే చుండ్రు సమస్య తగ్గుతుంది.

Posted in Uncategorized

Latest Updates