చలికి గజగజ వణుకుతున్న రాష్ట్రం

అటు చలికాలం.. ఇటు పెథాయ్‌ తుఫాను ప్రభావంతో రాష్ట్రం వణికి పోతోంది. తీవ్రమైన చలి గాలులతో ప్రజలు గజగజ వణుకుతున్నారు. చలిదెబ్బకు జనం ఇళ్లనుంచి బయటకి రావడం లేదు. పిల్లలు, వృద్ధులు, ఆస్తమా రోగులు ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారు. చలి కారణంగా రాష్ట్రంలోని  పలు జిల్లాల్లో ఏడుగురు చనిపోయారు. ఆసిఫాబాద్‌ జిల్లా కౌటగూడలో చలి తీవ్రతకు 10 ఆవులు చనిపోయాయి. నిన్న(మంగళవారం) రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయాయి.

పగటిపూట సాధారణం కంటే 6- నుంచి 10 డిగ్రీలు తగ్గాయి. కొన్ని ప్రాంతాల్లో కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతలు సమానంగా నమోదయ్యాయి. ఆదిలాబాద్‌లో 11, మెదక్‌ 12.8, హన్మకొండ 15, హకీంపేట 15.1, నిజామాబాద్‌లో 15.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఆదిలాబాద్,కొమురంభీమ్ జిల్లాల్లోని ప్రభుత్వ,ప్రైవేటు స్కూళ్లను  ఉదయం 10.30 గంటలకు తెరిచి సాయంత్రం 4 గంటలకు మూసేయాలని రెండు జిల్లాల కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు. నేటి నుంచి డిసెంబర్ 22 వరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates