చలిగాలులపై అప్రమత్తంగా ఉండాలి : సీఎం కేసీఆర్

పెథాయ్ తుపాను ఎఫెక్ట్ రాష్ట్రంపై పడింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చలిగాలులు వీస్తున్నాయి. ఈ క్రమంలో ఆయా జిల్లాల కలెక్టర్లు అలర్ట్ గా ఉండాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఆదిలాబాద్, భద్రాచలం, భూపాలపల్లి, పెద్దపల్లి, జగిత్యాల, మంచిర్యాల, నిర్మల్, కుమ్రం భీం జిల్లాల కలెక్టర్లు ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని సీఎం కేసీఆర్… కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్ కే జోషి తెలిపారు. అవసరమైన మెడిసిన్స్, బట్టలు, పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రజలకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని సీఎస్ కలెక్టర్లను ఆదేశించారు. జిల్లా యంత్రాంగం ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.

Posted in Uncategorized

Latest Updates