చలి…ఎండలు…జల్లులు : రాష్ట్రంలో ఇదో డిఫరెంట్ వెదర్

summer
ఉదయం చలి…మధ్యాహ్నం మండే ఎండలు…సాయంత్రానికి చిరు జల్లులు…ఇది రాష్ట్రంలోని ప్రస్తుతం టెంపరేచర్. మూడు రోజులుగా చాలా చోట్ల డిఫరెంట్ వెదర్ కనిపిస్తోంది. బంగాళాఖాతం నుంచి తేమతో కూడిన గాలులు తెలంగాణ మీదకు రావడంతో పాటు ఉత్తరం నుంచి పొడిగాలులు వీస్తుండటంతో వాతావరణంలో మార్పులు వస్తున్నాయంటున్నారు వాతవరణశాఖ అధికారులు. మరికొన్ని రోజుల పాటు వెదర్ ఇలాగే ఉంటుందన్నారు.

కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన అకాల వర్షాలు పడ్డాయి. కొన్నిచోట్ల ఉదయం చలి తీవ్రత బాగా పెరిగింది. ఉదయం 9 దాటితేనే చలి కాస్త తగ్గుతుంది. ఇక మధ్యాహ్నం ఎండ తీవ్రత పెరుగుతుంది. దీంతో అప్పుడే సమ్మర్ వచ్చేసినట్లు అనిపిస్తోంది. మళ్లీ సాయంత్రానికి చల్లని గాలులు వీస్తున్నాయి. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణంలో చాలా మార్పులు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో రాత్రిపూట కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణానికి ఒకటి రెండు డిగ్రీలు అటు ఇటుగా  నమోదవుతున్నాయని చెబుతున్నారు వాతావరణ అధికారులు. కనిష్ట ఉష్ణోగ్రతలు అయితే 15 నుంచి 19 వరకు.. గరిష్ట ఉష్ణోగ్రతలు 30 డిగ్రీల సెంటిగ్రేట్ గా నమోదవుతున్నాయి. రానున్న రోజుల్లో చలి తీవ్రత తగ్గే అవకాశం ఉందంటున్నారు. ఫిబ్రవరి చివరి వారం నుండి ఉష్ణోగ్రతలు పెగరటం మొదలవుతాయని చెప్పారు. ఇక చలికాలం పోతున్న టైంలో కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతల్లో మార్పులు వస్తాయంటున్నారు  అధికారులు.

Posted in Uncategorized

Latest Updates