చలి వణికిస్తోంది : ఆదిలాబాద్ లో 4.8 డిగ్రీలు

హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత కొనసాగుతోంది. హైదరాబాద్ తో పాటు ఉమ్మడి ఖమ్మం, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో చలి తీవ్రమైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఉదయం వేళ గ్రామాలు, పట్టణాల్లో పొగమంచు కమ్ముకుంటోంది. ఆదిలాబాద్ వాసుల్ని చలి మరింతగా వణికిస్తోంది. జిల్లాలో శనివారం ఈ సీజన్ లోనే అతి తక్కువగా 4.8 డిగ్రీల  కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. చలి తీవ్రత దృష్ట్యా కలెక్టర్ కార్యాలయం, పభుత్వ, ప్రైవేట్ స్కూళ్ల వేళల్లో మార్పులు  చేశారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా మూడ్రోజులుగా పొగమంచు కమ్మేసింది. ఉత్తరాది నుంచి చలిగాలులు వీస్తుండటం వల్ల జనం ఇబ్బంది పడుతున్నారు.

Posted in Uncategorized

Latest Updates