చల్లటి నీటిలో ఎర్రటి మిరపకాయలు : ఎవరు ఎక్కువ తింటే వారే విన్నర్

చైనా : కాస్త కారం తింటేనే తట్టుకోలేము. అలాంటిది ఎర్రటి మిరపకాయలు తీంటే ఎలా ఉంటుంది. కారం బాబోయ్ అంటూ గంతులేస్తాం. అయితే.. ఇప్పుడు దీన్నే సరదాగా తీస్కుంటూ ఎంజాయ్ చేస్తున్నారు చైనా దేశస్తులు. ఎవరు ఎక్కువ మిరపకాయలు తింటారో వారే విన్నర్ అనే గేమ్ ఆడుతూ ఆకట్టుకుంటున్నారు.

ఈ గేమ్ కి ‘క్రేజీ హాట్ ఆసియన్లు’ అనే పేరు పెట్టారు. నీటిలో ఎర్రటి పెద్ద మిరపపండ్లు వేశారు. అందులోకి దిగాక.. నిర్దేశించిన సమయంలో చేతిలో ఉన్న మిరపకాయలు ఎవరు ఎక్కువ తింటే వారే విజేత.

చల్లటి శీతాకాలంలో హాట్ గా ఉండే మిరపతింటే ఎలా ఉంటుంది అనే ట్యాగ్ లైన్ పెట్టారు. తూర్పు చైనాలో పలు ప్రదేశాల్లో ఈ గేమ్స్ ఆడుతూ ఆకట్టుకుంటున్నారు చైనీయులు. ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates