చల్లబడ్డాడు : మోడీతో భేటీ అయిన కుమారస్వామి

KUMARఅనేక నాటకీయ పరిణాల మధ్య కర్ణాటక 24వ సీఎంగా మే-23న ప్రమాణస్వీకారం చేసిన జేడీఎస్ బాస్ కుమారస్వామి ప్రధాని మోడీని కలిశారు. సోమవారం(మే-28) ఢిల్లీ వెళ్లిన కుమారస్వామి  ప్రధాని మోడీని కలిశారు. కొత్త సీఎంకి అభినందనలు తెలిపారు మోడీ. సీఎంగా భాద్యతలు చేపట్టిన తరువాత తొలిసారిగా మోడీని కలిసిన కుమారస్వామి మైసూరు తలపాగా,శాలువాతో ఆయనను సత్కరించారు. కర్ణాటకకు సంబంధించిన విషయాలపై మోడీతో చర్చించారు. అంతకుముందు రాజ్ ఘూట్ లో మహాత్ముడికి నివాళులర్పించారు కుమారస్వామి. అయితే కొన్ని రోజులుగా ప్రధాని మోడీ ఓ అబద్దాల కోరు, మాటలు తప్ప చేతల్లేవు అంటూ  కుమారస్వామి బహిరంగంగా విమర్శిస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates