చాంపియన్ ట్రోఫీ హాకీ ఫైనల్ : భారత్ కు సిల్వర్

indవరుసగా రెండోసారి చాంపియన్స్‌ ట్రోఫీలో భారత పురుషుల హాకీ జట్టు రన్నరప్‌ తో సరిపెట్టుకుంది. ప్రపంచ చాంపియన్‌ ఆస్ట్రేలియాతో ఆదివారం (జూలై-1) జరిగిన ఫైనల్లో భారత్‌ పెనాల్టీ షూటౌట్‌ లో 1–3తో పరాజయం పాలైంది. నిర్ణీత సమయం ముగిసేవరకు రెండు జట్లు 1–1తో సమంగా ఉండటంతో విజేతను షూటౌట్‌ ద్వారా నిర్ణయించారు. 2016 చాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్లోనూ భారత్‌ షూటౌట్‌ లోనే 1–3 స్కోరుతో ఆస్ట్రేలియా చేతిలోనే ఓడిపోవడం గమనార్హం. నిర్ణీత సమయంలో 24వ నిమిషంలో బ్లేక్‌ గోవర్స్‌ గోల్‌ తో ఆసీస్‌ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది, అనంతరం వివేక్‌ ప్రసాద్‌ (42వ నిమిషంలో) గోల్‌ తో భారత్‌ 1–1తో స్కోరును సమం చేసింది.

Posted in Uncategorized

Latest Updates