చాక్లెట్ ఆశ చూపించి 4 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం

CHACOLTEచిన్నారులపై లైంగిక దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. చాక్లెట్ ఆశ చూపించి నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం చేశాడు ఓ 24 ఏళ్ల యువకుడు. ఒడిషాలోని బాలాసోర్‌ జిల్లాలో శుక్రవారం(ఏప్రిల్-13) ఈ దారుణం జరిగింది.
శుక్రవారం(ఏప్రిల్-13) ఉదయం తన ఇంటి బయట ఆడుకుంటున్న చిన్నారికి చాక్లెట్ ఇస్తానని తన ఇంటికి తీసుకెళ్లిన 24 ఏళ్ల యువకుడు చిన్నారిపై అత్యాచారం చేశాడు. జరిగిన విషయాన్ని చిన్నారి తన తల్లికి చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. చిన్నారి ఆరోగ్యపరిస్ధితి క్షీణించడంతో తల్లిదండ్రులు నీలగిరి హాస్పిటల్ కు ట్రీట్ మెంట్ కోసం చిన్నారిని తరలించారు. ఈ విషమంపై శనివారం(ఏప్రిల్-14) చిన్నారి తల్లిదండ్రులు నీలగిరి పోలీస్ స్టేషన్ లో కంఫ్లెయింట్ చేశారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నామని నీలగిరి పోలీస్‌ స్టేషన్‌ SI రమేష్‌ సింగ్‌ తెలిపారు. మరోవైపు చిన్నారులపై లైంగిక దాడులు పెరిగిపోవడంతో దేశవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్న సమయంలో ఈ ఘటన కలకలం రేపింది.

Posted in Uncategorized

Latest Updates