చానుకు షాక్ : డోపింగ్ టెస్టులో విఫలం.. సస్పెన్షన్

CHANUభారత వెయిట్‌ లిఫ్టర్ సంజితా చానుకు అనుకోని షాక్ తగిలింది. డోప్‌ టెస్టులో పాజిటివ్‌ గా తేలడంతో చానుపై సస్పెన్షన్ వేటు పడినట్లు ఇంటర్నేషనల్ వెయిట్‌ లిఫ్టింగ్ ఫెడరేషన్  (IWF) తెలిపింది. టెస్టోస్టిరాన్‌ ను పెంచే నిషిద్ధ ఉత్ప్రేరకాన్ని చాను ఉపయోగించినట్లు వెల్లడించింది. రెండుసార్లు కామన్‌ వెల్త్ చాంపియన్‌గా నిలిచిన చాను గోల్డ్‌ కోస్ట్‌లో ముగిసిన క్రీడలలో 53 కేజీల విభాగంలో స్వర్ణం గెలిచిన విషయం తెలిసిందే.

సంజితా చాను డోపింగ్ టెస్టులో విఫలమైంది. కామన్వెల్త్ క్రీడల సందర్భంగా చాను నుంచి తీసుకున్న శాంపిల్‌ ను పరీక్షలకు పంపగా..టెస్టోస్టిరాన్ స్థాయిలు పెరిగే ఉత్ప్రేరకాలు సేవించినట్లుగా తెలిసింది. దీంతో చానుపై తాత్కాలికంగా సస్పెన్షన్ పడింది అని తెలిపింది IWF. ప్రస్తుతం హిమాచల్‌ ప్రదేశ్‌ లోని జాతీయ క్యాంపులో శిక్షణ తీసుకుంటున్న చాను.. ఈ నిర్ణయంతో క్యాంపు వదిలి స్వస్థలమైన మణిపూర్‌ కు పయనమైంది.

 

Posted in Uncategorized

Latest Updates