చార్జ్‌షీట్ ఉన్నా ఎన్నికల్లో పోటీకి అర్హుడే: సుప్రీం

ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థిపై చార్జ్‌షీట్ ఉన్నా ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హుడేనని తెలిపింది సుప్రీం కోర్టు. క్రిమినల్ కేసు ఉన్నంత మాత్రాన అనర్హుడిగా ప్రకటించలేమని స్పష్టం చేసింది. క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆయా కేసుల్లో దోషులుగా తేలకముందే వారిని అనర్హులుగా ప్రకటించాలా? లేదా? అన్న ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై సుప్రీం ధర్మాసనం ఇవాళ తీర్పును వెలువరించింది. చార్జ్‌షీట్ ఉన్నంత మాత్రాన ఎన్నికలకు అనర్హుడిగా ప్రకటించలేమని తెలిపింది. ఈ విషయంలో పార్లమెంట్ కఠిన చట్టాలు చేయాలని సూచించింది. దేశంలో ఎన్నికలను డబ్బు, మందబలం శాసిస్తున్నాయంది. అభ్యర్థుల అనర్హతపై సుప్రీం నిర్ణయం తీసుకోలేదని తెలిపింది. అభ్యర్థులందరూ పెండింగ్ కేసుల వివరాలు తెలపాలని చెప్పింది. రాజకీయ అవినీతి ఆర్థిక ఉగ్రవాదంతో సమానమని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది.

 

Posted in Uncategorized

Latest Updates