చార్మినార్ దగ్గర ఉద్రిక్తత : బతుకమ్మకు ఆటంకం

హైదరాబాద్‌: భాగ్యనగరంలోని పాతబస్తీ చార్మినార్ పోలీసు స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. చార్మినార్ భాగ్యలక్ష్మీ ఆలయం దగ్గర బతుకమ్మ సంబురాలు నిర్వహించేందుకు బీజేపీ మహిళా మోర్చా నేతలు సిద్ధమయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకొని మహిళలను అడ్డుకున్నారు. దీంతో మహిళా నేతలు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. వారిని అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్‌ కు తరలించారు. అయితే రద్దీ ఎక్కువగా ఉండేచోటు కాబట్టే ..చార్మినార్ దగ్గర బతుకమ్మకు పోలీసులు అనుమతి ఇవ్వలేదని సమాచారం.

 

 

 

Posted in Uncategorized

Latest Updates