చార్మినార్ దగ్గర మట్టి వినాయకుడి నిమజ్జనం

హైదరాబాద్ :  మతసామరస్యం చాటేందుకు, పర్యావరణం కాపాడుదామని పిలుపునిస్తూ చార్మినార్ దగ్గర చిన్న మట్టి వినాయకుని నిమజ్జనం చేశారు భక్తులు. గణేశ్ నిమజ్జనం మతసామరస్యం చాటుతుందని చెప్పారు. అందుకు గుర్తుగానే.. చార్మినార్ లాంటి పందిరి వేసి నవరాత్రులు ఇంట్లో పూజచేశారు.

మట్టి వినాయకుడిని పూజించి నిమజ్జనం చేస్తే జల కాలుష్యాన్ని కాపాడినవాళ్లం అవుతామని చెప్పారు. ఈ పిలుపునిచ్చేందుకే మట్టి వినాయకుడిని చార్మినార్ దగ్గర నిమజ్జనం చేశామన్నారు భక్తులు. బకెట్ నీళ్లలో మట్టి వినాయకుడిని పెట్టి కుటుంబసభ్యులు చార్మినార్ ముందు నిమజ్జనం చేశారు.

 

 

Posted in Uncategorized

Latest Updates