చార్​ధామ్ టెంపుల్స్ లో భక్తులకు నో ఎంట్రీ

డెహ్రడూన్​: చార్​థామ్ యాత్రలో భాగమైన గంగోత్రి, యమునోత్రి టెంపుల్స్​ను ఈ వారం రోజుల్లో తెరుస్తున్నప్పటికీ భక్తులను మాత్రం అనుమతి లేదని ఉత్తరాఖండ్​ ప్రభుత్వం శుక్రవారం తెలిపింది. ఆరు నెలల విరామం తర్వాత ఈ నెల 26న గంగోత్రి, యమునోత్రి ఆలయాలను తెరవడంతో చార్​థామ్ యాత్ర ప్రారంభమవుతుంది. కేదార్‌నాథ్ టెంపుల్​ ఏప్రిల్ 29న, బద్రీనాథ్ ఆలయం మే 15న తెరుచుకోనున్నాయి. కరోనా ఎఫెక్ట్​తో ఈ సారి ఆలయాలు తెరవడంలో జాప్యం జరిగింది. ఓపెనింగ్​ కార్యక్రమంలో పూజారులతోపాటు ఆలయాల కమిటీలు మాత్రమే పాల్గొనాలని సర్కారు ఆదేశాలు జారీ చేసింది. కేంద్రం నుంచి ఆదేశాలు వచ్చే వరకు లాక్​డౌన్​ రూల్స్​ను కొనసాగిస్తామని వెల్లడించింది.

Chardham temples to reopen, no pilgrim to be allowed

Latest Updates