చాలా ఈజీ: ఆన్ లైన్లోనే ఇక బస్సు పాస్ లు

bus-pass-tsఅకాడమిక్ ఇయర్ మొదలైంది. విద్యార్ధులు ఉదయాన్నే కాలేజీలకు రెడీ అయ్యారు. మరోవైపు విద్యార్థుల బస్సు పాస్ ల  హడావుడి మొదలైంది. పాస్ ల కోసం డిపోలకు భారీ సంఖ్యలో చేరుకుని క్యూలు కడుతున్నారు. అయితే వారికి బస్సు పాసులను ఈజీగా తీసుకునేందుకు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్ చర్యలు చేపట్టింది. విద్యార్థులు బస్సు పాసుల కోసం బారులు తీరే పని లేకుండా గతేడాదే చర్యలు చేపట్టిన ఆర్టీసీ అధికారులు ఈ ఏడాది ఆన్ లైన్ సేవలను మరింత సులభతరం చేశారు. http://online.tsrtcpass.in వెబ్ సైట్ లో బస్సు పాస్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. విద్యార్థి చదువుతున్న విద్యాసంస్థకు కేటాయించిన కోడ్ ను నమోదు చేయాలి. దీంతో ఆ దరఖాస్తు నేరుగా విద్యార్థి చదువుతున్న విద్యాసంస్థకు కేటాయించిన కోడ్ ను నమోదు చేయాలి. దీంతో ఆ దరఖాస్తు నేరుగా విద్యార్ధి చదువుతున్న కాలేజీకి అనుమతి కోసం ఆన్ లైన్లోనే వెళ్తుంది. విద్యాసంస్థల్లో ఆ బస్సు పాసులను పరిశీలించి…దరఖాస్తు దారు…తమ విద్యార్ధి అవునో…కాదోఅని నిర్ధారిస్తారు. తర్వాత RTC కి తిరిగి అదే వెబ్ సైట్ ద్వారా పంపిస్తారు. విద్యా సంస్థకు చెందిన అధికారి క్షణాల్లో ఈ పనిని పూర్తి చేయవచ్చు. బస్సు పాస్ కోసం ఆన్ లైన్లో విద్యార్ధి దరఖాస్తు చేసుకున్నప్పుడు రసీదు కూడా ప్రింట్ తీసుకోవాలి.  ఆ రసీదు తీసుకుని కాలేజీలకు వెళ్లి అక్కడ బస్సుపాస్ ను పరిశీలిస్తున్న ఉద్యోగితో దరఖాస్తును ఆర్టీసీకి పంపేలా చూసుకోవాలి. రసీదు సంతకం పెట్టించుకుని కౌంటర్ దగ్గరకు వెళితే బస్సుపాస్ ఇస్తారు.

Posted in Uncategorized

Latest Updates