చాలా గ్యాప్ వచ్చింది : ఆఫ్రికా దేశాల పర్యటనకు బయల్దేరిన మోడీ

ఆఫ్రికన్ దేశాల పర్యటనకు బయలు దేరి వెళ్లారు ప్రధాని నరేంద్ర మోడీ. మూడు దేశాల్లో ఐదు రోజుల పాటు పర్యటించనున్నారు. సౌతాఫ్రికా, ఉగాండా, రువాండా దేశాల్లో తిరగనున్నారు. మోడీ ఫస్ట్ టైం రువాండాకు వెళ్తున్నట్లు తెలిపారు విదేశాంగా అధికారులు. ఇప్పటి వరకూ ఏ భారత ప్రధాని కూడా రువాండాలో పర్యటించలేదు. మన దేశ రాజధాని ఢిల్లీ కన్నా తక్కువ జనాభా ఉండే రువాండాలో పర్యటిస్తున్నమొదటి భారత ప్రధానిగా మోడీ నిలిచారు. 25 నుంచి 27 వరకు జరగనున్న బ్రిక్స్ దేశాల సమ్మిట్ లో పాల్గొంటారు ప్రధాని మోడీ. మరోవైపు టూర్ లో భాగంగా ఉగాండా, రువాండా అధ్యక్షులతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు ప్రధాని.

Posted in Uncategorized

Latest Updates