చాలా జాగ్రత్తగా ఉండాలి : మండే ఎండలు.. దుమ్ము తుఫాన్లు

AJIJI

రాబోయే నాలుగు రోజులు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి.. బయటకు వెళ్లేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి.. డోంట్ కేర్ అని రోడ్డెక్కితే మాడు పగులుతుంది.. ఇంకా తెగిస్తాం అంటే దుమ్ముకొట్టుకుపోతారు.. అవును ఇవాల్టి నుంచి మరో నాలుగు రోజుల వరకు భగభగ మండే సూర్యుడు ఉంటాడు. అంతే కాదు.. ఏ క్షణం అయినా విరుచుకుపడే దుమ్ము తుఫాన్లు ఉంటాయని హెచ్చరించింది భారత వాతావరణ శాఖ.

ముఖ్యంగా ఢిల్లీ, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్ధాన్ రాష్ట్రాల్లో ఎండ తీవ్రత అధికంగా ఉంటుందని ప్రకటించింది. టెంపరేచర్ 45 డిగ్రీలు టచ్ అవుతుందని.. వేడిగాలులు కూడా ఉంటాయని హెచ్చరించింది IMD. వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపింది. రాజస్ధాన్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీలోని కొన్ని ఏరియాల్లో గురువారం (మే-24) దుమ్ము తుఫాన్ వచ్చే అవకాశాలూ ఉన్నాయని వార్నింగ్ ఇచ్చింది వాతావరణ శాఖ. ఇప్పటికే ఢిల్లీలో 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అవుతుంది. ఇది 2 డిగ్రీలు పెరగనుంది. రోడ్లపైకి వచ్చేందుకు ఎవరూ సాహసించడంలేదు. దీంతో ఢిల్లీలోని ప్రధాన వీధులు నిర్మానుష్యంగా మారాయి.

ఇక తెలంగాణలో ఎండ తీవ్రత అధికంగా ఉంటుందని వెల్లడించింది. రాబోయే నాలుగు రోజులు మండే ఎండలు ఉంటాయని.. ఈదురుగాలులతో కూడిన అకాల వర్షాలు ఉంటాయని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది వాతావరణ శాఖ. సో.. ముందస్తుగా అందరూ జాగ్రత్తలు తీసుకోండి. ఎండలో తిరగొద్దు.. అత్యవసర పనులు అయితేనే రోడ్డెక్కండి..

Posted in Uncategorized

Latest Updates