చాలా డేంజర్ అంట! : పతంజలి కింబో యాప్ డిలీట్

KIMవాట్సాప్ కు పోటీగా బాబా రాందేవ్ తీసుకొచ్చన స్వదేశీ మెసెంజింగ్ యాప్ కింబో గూగుల్ ప్లే స్టోర్ నుంచి డిలీట్ అయిపోయింది. బుధవారం (మే-31) విడుదలైన ఈ యూప్ ఒక్కరోజు కూడా కాకముందే గూగుల్ ప్లే స్టోర్ దీన్ని డిలీట్ చేసింది. ఈ యాప్ అత్యంత ప్రమాదకరమైనదని, ఇందులో బగ్స్ ఉన్నాయంటూ డెవలపర్లు హెచ్చరిస్తున్నారు. ఈ కింబో యాప్ లో ఓ పాకిస్ధానీ నటి ఫోటో కనిపిస్తుందంటూ ఓ యూజర్ తన ట్విట్టర్ ద్వారా కొన్న స్క్రీన్ షాట్లు షేరు చేయడంతో ఇప్పుడు ఇది సంచలనంగా మారింది.

ఈ యాప్ చాలా డేంజర్ అంటూ పలువురు టెక్ నిపుణులు సైతం హెచ్చరిస్తున్నారు. తమ ప్లేస్టోర్ నుంచి కింబో ను తొలగించడంపై గూగుల్ స్పందించలేదు. ఐఫోన్స్, ఐప్యాడ్స్‌లకు మాత్రం యాప్ స్టోర్‌లో ఈ యాప్ అందుబాటులో ఉంది. యాప్ రూపొందించే సమయంలో కావాలనే పాకిస్తాన్ నటి ఫొటోను పెట్టారా లేక పొరపాటున వచ్చిందా అనేది కూడా ఇంకా వెల్లడించలేదు పతంజలి కమ్యూనికేషన్స్. స్వదేశీ యాప్ అంటూ ప్రచారం చేసుకుంటూ.. పాక్ నటి ఫొటో ఎలా వచ్చిందనేది కూడా చర్చనీయాంశం అయ్యింది. ఇక యాప్ లో కొన్ని డేంజర్ బగ్స్ ఉన్నాయని సాఫ్ట్ వేర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. విడుదల అయిన 24 గంటల్లోనే ఇన్ని వివాదాలు చుట్టుముట్టిన పతంజలి కింబో యాప్ ను ప్రస్తుతానికి గూగుల్ ప్లే స్టోర్ నుంచి డిలీట్ అయ్యింది. మరిన్ని అప్ డేట్స్ తో ఎప్పుడు వస్తుందో చూడాలి…
KIMBO

Posted in Uncategorized

Latest Updates