చికాగో సెక్స్ రాకెట్ పై ఫిల్మ్ ఛాంబర్ స్పందించాలి : మహిళా సంఘాలు

sex tollywoodతెలుగు అమ్మాయిలను తీసుకెళ్లి వేరే దేశాల్లో వ్యభిచారం చేస్తున్న ముఠా గురించి.. ఫిలించాంబర్ ఎందుకు స్పందించడంలేదని నిలదీశాయి మహిళా సంఘాలు. ఇటీవల షికాగోలో వెలుగుచూసిన టాలీవుడ్‌ సెక్స్ రాకెట్ గురించి తెలుగు సినిమా పరిశ్రమ పెద్దలు ఎందుకు స్పందించడం లేదని మహిళా ఐక్యకార్యాచరణ సంఘం నాయకురాలు దేవి ప్రశ్నించారు.

సోమవారం హైదరాబాద్ లోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడారు మహిళా నేతలు.  టాలీవుడ్‌లో గత నాలుగు నెలలుగా కొనసాగుతున్న క్యాస్టింగ్‌ కౌచ్‌, ఇప్పుడు షికాగో సెక్స్‌ రాకెట్‌ విషయాలపై తెలుగు సినీపరిశ్రమను తాము ప్రశ్నిస్తున్నామని, మొత్తం 24 మహిళా సంఘాలు తరఫున తాము ఈ రెండు అంశాలపై మాట్లాడుతున్నామని తెలిపారు.  మహిళా సంఘాల కార్యాచరణ తరఫున నిర్వహించిన మీడియా సమావేశంలో దేవీ మాట్లాడారు. సినీ పరిశ్రమకు సంబంధించి మూడుసార్లు సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ను, టాలీవుడ్‌, ఎఫ్డీసీ పెద్దలతో చర్చలు జరిపామని తెలిపారు. మహిళలపై లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా క్యాష్ కమిటీ వేస్తామని సినీ నటుల అసోసియేషన్‌ మా చెప్పినప్పటికీ, ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు దేవీ.

మహిళా హక్కుల కార్యకర్త సజయ మాట్లాడుతూ.. బాధితులకు కనీసం మాట్లాడటానికీ భయపడే పరిస్థితి నెలకొందని,‌.. మహిళలనే బలిపశువులు చేస్తున్నారని మండిపడ్డారు. తప్పు ఎలా జరిగింది అని చెప్పే దమ్ము ఎవరికీ లేదని, అయితే, బాధితులను భయపెట్టి.. వారిని వెన్నుపోటు పొడిచే ప్రయత్నం జరుగుతోందని, ఇది వ్యవస్థీకృత నేరమని ఆమె ధ్వజమెత్తారు.  ఈ విషయమై ఇంతవరకు టాలీవుడ్‌ పట్టించుకోకపోవటం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ‌‌అమెరికా కేంద్రంగా జరుగుతున్న సెక్స్ రాకెట్‌లో సినీ పెద్దల ప్రోత్సాహం ఉందన్నారు మరో మహిళా సంఘం నేత సుజాత. ఈ పరిస్థితిపై సమగ్ర చర్చ జరగాలని, నిజాలు వెలికితీయాలని ఆవేదన వ్యక్తం చేశారు.

 

Posted in Uncategorized

Latest Updates