చికెన్ కొరతతో KFC రెస్టారెంట్ల మూసివేత

kfcచికెన్ కొరతతో బ్రిటన్ లోని కేఎఫ్ సీ రెస్టారెంట్లు మూతపడుతున్నాయి. బ్రిటన్ లో ఉన్న 900 రెస్టారెంట్లలో 400 కు పైగా కేఎఫ్ సీ రెస్టారెంట్లను ఇప్పటికే మూసివేసినట్లు కేఎఫ్ సీ ప్రకటించింది. చికెన్ దొరకకపోవడంతోనే అవుట్ లెట్ లు మూపివేస్తున్నట్లు ప్రకటించింది. చికెన్ రవాణా పాత కాంట్రాక్ట్ ను రద్దు చేసి మంగళవారం(ఫిబ్రవరి13)న DHL ట్రాన్స్ పోర్ట్ సంస్ధకు కేఎఫ్ సీ చికెన్ రవాణా బాధ్యతలను అప్పగించింది. అయితే అప్పటి నుండి చికెన్ సరఫరాలో సమస్యలు వచ్చాయని, దేశవ్యాప్తంగా ఫ్రెష్ చికెన్ తీసుకురావడం సమస్యగా ఉందని, నాణ్యత విషయంలో తాము రాజీ పడమని కేఎఫ్ సీ ట్వీట్ చేసింది. కేఎఫ్ సీలో పని చేస్తున్న ఉద్యోగులు సెలవు తీసుకోవచ్చని కేఎఫ్ సీ తెలిపింది.

Posted in Uncategorized

Latest Updates