చిక్కుల్లో సిద్ధూ : పాకిస్తాన్ పక్షిని సీఎంకు గిఫ్ట్ గా ఇచ్చాడు

చండీగఢ్:  పంజాబ్ మంత్రి నవ్‌ జ్యోత్ సింగ్ సిద్ధూ మరోసారి చిక్కుల్లో పడ్డారు.  తొలిసారి ఇమ్రాన్‌ ఖాన్ ప్రమాణ స్వీకారానికి వెళ్లిన సమయంలో పాక్ ఆర్మీ చీఫ్‌ ను సిద్ధూ ఆలింగనం చేసుకున్నప్పటి నుంచీ.. ఆయన ఏదో ఒక వివాదంలో నిలుస్తూనే ఉన్నారు. రాజస్థాన్ ఎన్నికల ర్యాలీలో పాకిస్థాన్ జిందాబాద్ అని సిద్ధూ చేసిన నినాదాలు పెను వివాదం రేపాయి. లేటెస్ట్ గా  మరోసారి బుక్కయ్యారు సిద్ధూ.

పాకిస్థాన్ తనకు గిఫ్ట్‌ గా ఇచ్చిన ఓ పక్షిని.. పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్‌ కు బహుమతిగా ఇచ్చారు. అయితే ఆ పక్షిని ఆయన పాకిస్థాన్ నుంచి ఎలా పట్టుకొచ్చారు.. ఇన్నాళ్లూ పంజాబ్‌ లో ఎలా దాచి పెట్టారో విచారణ జరపాలంటూ.. ఓ వాలంటీర్ …. వైల్డ్‌ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరోకు ఫిర్యాదు చేశాడు. సిద్ధూ చర్య 1972 వణ్యప్రాణి సంరక్షణ చట్టాన్ని ఉల్లంఘించడమే అవుతుందని ఆ వాలంటీర్ స్పష్టం చేశాడు. అనుమతి లేకుండా ఓ పక్షి లేదా  జంతువును ఇంట్లో పెట్టుకోవడం అక్రమమే అవుతుందని తన ఫిర్యాదులో తెలిపాడు.

Posted in Uncategorized

Latest Updates