చిచ్చర పిడుగు పృథ్వీషాకు తుది జట్టులో చోటు దక్కేనా..

మరో మూడు రోజుల్లో వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌ మొదలు కానుంది. గెలుపు ఓటముల గురించి పెద్దగా చర్చల్లేవు.. విశ్లేషణలు లేవు. కానీ అటు విశ్లేషకుల నుంచి.. ఇటు అభిమానుల నుంచి వినిపిస్తున్న చర్చ ఒక్కటే.. ఇంతకీ చిచ్చర పిడుగు పృథ్వీషాను తుది జట్టులోకి తీసుకుంటారా? లేదా? ఒకవేళ జట్టులోకి తీసుకుంటే ఓపెనర్‌గా ఆడిస్తారా? టెస్టుల్లో మాదిరిగానే ఇక్కడా ఈ చిన్నోడు శతక్కొడతాడా? విజయ్‌ హజారే ట్రోఫీలో ఆఫ్ సెంచరీతో అదరగొట్టిన షాను రోహిత్‌శర్మకు జోడీగా బరిలోకి దించేందుకు టీమిండియా మేనేజ్‌మెంట్‌ సాహసిస్తుందా? అన్న అంశం సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది. వచ్చే ఏడాది వరల్డ్ కప్ టోర్నీ ఉన్నందున యువకుల సత్తాను పరీక్షించేందుకు విండీస్‌ టూర్‌ను సద్వినియోగం చేసుకుంటామని సెలక్టర్లు చెప్పారు. ఎంఎస్‌కే ప్రసాద్‌ నేతృత్వంలో కోచ్‌ రవిశాస్త్రి, కెప్టెన్‌ రోహిత్‌శర్మ, రహానే, రోహిత్‌శర్మలతో ప్రయోగాలకు సంబంధించి కొద్దిరోజుల కిందట రివ్యూ భేటీ జరిగినట్లు తెలుస్తున్నది. ఇదే నిజమైతే పృథ్వీషాకు కచ్చితంగా తుది జట్టులోకి రావడం ఖాయమంటున్నారు విశ్లేషకులు.

Posted in Uncategorized

Latest Updates